వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభం కలగాలి: అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లోని హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ చిస్తీ గరీబ్ నవాజ్ దర్గాకు ప్రతియేటా సంప్రదాయబద్ధంగా పంపే చాదర్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శుక్రవారం మైనారిటీ సంక్షేమశాఖ అధికారులకు అందజేశారు. మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, డైరెక్టర్ జలాలుద్దీన్ శనివారం దర్గాలో సమర్పిస్తారు.

చాదర్‌తోపాటు రూ. 2.5లక్షల నజరానాను కూడా ముఖ్యమంత్రి దర్గాకు పంపారు. అజ్మీర్ దర్గాకు పంపే చాదర్‌ను నగరంలోని పాతబస్తీలో ప్రత్యేకంగా తయారు చేశారు. చాదర్‌పై దర్గా, మక్కా మదీన చిత్రాలతోపాటు ‘హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ ఫ్రమ్ కె. చంద్రశేఖర్ రావు' అని కూడా వేయించారు.

కెసిఆర్

కెసిఆర్

రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లోని హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ చిస్తీ గరీబ్ నవాజ్ దర్గాకు ప్రతియేటా సంప్రదాయబద్ధంగా పంపే చాదర్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శుక్రవారం మైనారిటీ సంక్షేమశాఖ అధికారులకు అందజేశారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఇతర మైనారిటీ నేతలు పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ చాదర్‌ను అజ్మీర్ దర్గా దివాన్ జైనుల్ ఆబెదీన్‌కు తన తరఫున అందజేయాలని ఆయన మైనారిటీ సంక్షేమశాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించారు.

కెసిఆర్

కెసిఆర్


చాదర్‌తోపాటు రూ. 2.5లక్షల నజరానాను కూడా ముఖ్యమంత్రి దర్గాకు పంపారు. అజ్మీర్ దర్గాకు పంపే చాదర్‌ను నగరంలోని పాతబస్తీలో ప్రత్యేకంగా తయారు చేశారు.

కెసిఆర్

కెసిఆర్

చాదర్‌పై దర్గా, మక్కా మదీన చిత్రాలతోపాటు ‘హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ ఫ్రమ్ కె. చంద్రశేఖర్ రావు' అని కూడా వేయించారు.

అజ్మీర్ దర్గాలో తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రూ. 5కోట్లతో రూబాత్(గెస్ట్ హౌజ్) నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. స్థలం కేటాయించాలని కెసిఆర్ ఇప్పటికే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు లేఖ రాశారు. ఆ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఈ విషయాన్ని కూడా పరిశీలించి, అక్కడి అధికారులతో మాట్లాడాలని సిఎం తెలంగాణ అధికారులను ఆదేశించారు.

అజ్మీర్ ఉత్సవాలు గొప్పగా జరగాలని, అందరికీ శుభం కలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఇతర మైనారిటీ నేతలు పాల్గొన్నారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Friday sent A Chadar to Rajasthan Ajmer Dargah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X