వీధిరౌడీల్లా: జగన్ పార్టీపై ఈసికి సిఎం రమేష్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ కేంద్ర ఎన్నికల కమిషన్ (సిఈసి)కి ఫిర్యాదు చేశారు ఆయన సిఈపిసి సంపత్‌తో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. పోలింగ్ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు వాళ్లు వీధిరౌడీల్లా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు
సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు చేసిన దాడులు, అక్రమాలపై ఓ నివేదికను సంపత్‌కు అందజేశారు. కొన్ని చోట్ల జరిగిన రిగ్గింగ్‌కు సంబంధించి వీడియో క్లిపింగ్స్‌ను సిఈసికి అందజేశారు. కడప, జమ్మలమడుగుతో పాటు రాయలసీమలోని కొన్ని చోట్ల రీపోలింగ్ జరపాల్సిన అవసరం ఉందని సంపత్‌కు సీఎం రమేష్ విజ్ఞప్తి చేశారు.

సిఈసి సంపత్‌తో భేటీ తర్వాత రమేష్ మీడియాతో మాట్లాడారు. పోలింగ్ రోజు జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పోలింగ్ ఏకపక్షంగా జరిగేలా బీభత్సం సృష్టించారని ఆయన ఆరోపించారు. ఐపియస్ అధికారులపై దాడులు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు
ఎఎస్పీ, ఎస్పీలపై దాడి ఘటనపై కూడా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. తమ ఫిర్యాదుపై ఎన్నికల కమిషనర్ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications