కోడిపందేలు: నిందితులు బయటికి.. కోళ్లు మాత్రం జైల్లోనే!

విశాఖపట్నం: పందేల్లో పాల్గొన్నాయనే నెపంతో కోళ్లను లాకప్‌లో పెట్టిన వింత ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. అచ్యుతాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా జరిగిన కోడిపందేలపై పోలీసులు వరుసగా దాడులు చేశారు.

ఈ దాడుల్లో ఎనిమిదిమంది నిందితులతోపాటు తొమ్మిది కోడి పుంజులను కూడా పట్టుకున్నారు. అయితే, నిందితులను వ్యక్తిగత పూచీపై విడిచిపెట్టారు. ఆ తర్వాత కోడి పుంజులను, నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు.

cocks in atchutapuram police station

కాగా, మిగిలిన ప్రాంతాల్లో పట్టుకున్న కోడి పుంజులతో సహా అన్నింటినీ ఒకేసారి ప్రవేశపెట్టాలన్న కోర్టు ఆదేశాల మేరకు వీటిని తిరిగి స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 9కోడిపుంజులు కూడా అచ్యుతాపురం పోలీస్ స్టేషన్‌లోనే బంధీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+