సినీ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత

ధర్మవరపు వయస్సు 54 ఏళ్లు బావా బావా పన్నీరు ఆయన నటించిన తొలి చిత్రం. దూరదర్శన్‌లో ఆనందో బ్రహ్మ కామెడీ సీరియల్‌లో ఆయన నటించారు. నరేష్ హీరోగా నటించిన తోకలేని పిట్ట సినిమాకు దర్శకత్వం వహించారు. దానికి సంగీతాన్ని కూడా సమకూర్చారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతి మండలి చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయనకు పలు అవార్డులు వచ్చాయి. ఆయనకు ఇద్దరు కుమారులు. ఆయన వందలాది సినిమాల్లో నటించారు. హాస్యరసాన్ని సినిమాల్లో పండించడంలో తనదైన శైలిని ప్రదర్శించారు.
ధర్మవరపు ఆఖరి సినిమా షాడో. ఇటీవల దరువు సినిమాలో ఆయన కడుపుబ్బా నవ్వించారు. ప్రస్తుతం ఆయన రుద్రమదేవి చిత్రంలో నటిస్తున్నారు. ఆయన మృతితో టాలీవుడ్ విషాద సముద్రంలో మునిగిపోయింది. ఆయన పలు అవార్డులు పొందారు. రఘుపతి వెంకయ్య అవార్డు, బిఎన్ రెడ్డి జాతీయ అవార్డు. ఎన్టీఆర్ జాతీయ అవార్డు ఆయన పొందారు. వైయస్ రాజశేఖర రెడ్డి చొరవతో ఆయన కాంగ్రెసు పార్టీలో పనిచేశారు.
ధర్మవరపు మృతికి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డికె అరుణ సంతాపం ప్రకటించారు. మాజీ మంత్రి, శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ధర్మవరపు మృతికి సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications