కేంద్రం జీఎస్టీ తగ్గింపును మింగేస్తున్న కంపెనీలు ? సాయిరెడ్డి బిగ్ బాంబ్..!
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మధ్య కేంద్ర ప్రభుత్వానికి పలు అంశాల్లో సూచనలు, సలహాలు ఇచ్చే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. దేశ, విదేశీ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ట్వీట్లు పెడుతున్న ఆయన.. ఇదే క్రమంలో ఇవాళ మరో కీలక అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తాజాగా కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గించడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం కల్పించి, తద్వారా వినియోగం పెంచాలని భావిస్తోంది. అయితే కేంద్రం ఆలోచన ఎలా పక్కదారి పడుతోందో వివరిస్తూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
కేంద్రం గతంలో నాలుగు స్లాబ్ లుకా ఉన్న జీఎస్టీని రెండు స్లాబ్ లకు కుదించింది. దీంతో రెండు స్లాబ్ లలో ఉన్న వస్తువులు, సేవలు కాస్తా ఇప్పుడు మిగిలిన రెండు స్లాబ్ లకు వచ్చి చేరాయి. దీంతో పలు వస్తువులపై భారీగా జీఎస్టీ రేటు తగ్గిపోయింది. దీపావళి కానుకగా దీన్ని అందిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు భారత్ పై సుంకాల మోత మోగించిన నేపథ్యంలో దేశీయ వినియోగాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రయోజనం వినియోగదారులకు అందుతుందా లేదా అన్న అనుమానాలు ఉండనే ఉన్నాయి.

While the Govt. has taken a bold step by cutting GST rates, some companies are hiking prices to pocket extra profits instead of passing the benefit to consumers. I urge Hon’ble Finance Minister @nsitharaman garu to take action against those that have raised prices after the GST…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 13, 2025
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బాంబు పేల్చారు. కేంద్రం జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగదారులకు ప్రయోజనం కల్పించాలని భావించిందని, అయితే కొన్ని కంపెనీలు ఈ ప్రయోజనాన్ని వాస్తవంగా వినియోగదారులకు బదిలీ చేయకుండా రేట్లు పెంచి దీన్ని మింగేస్తున్నారని సాయిరెడ్డి ఆరోపించారు. కాబట్టి జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత వస్తువుల రేట్లు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని సాయిరెడ్డి.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ఈ మేరకు ఆమె అకౌంట్ ను ఎక్స్ లో ట్యాగ్ చేశారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications