అమ్మాయిలను సరఫరా చేస్తాడంటూ..: పోస్టర్లలో స్నేహితుడి షాక్!

విజయవాడ: ఇద్దరు స్నేహితుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఓ వ్యక్తి మరో వ్యక్తి పైన అమ్మాయిలను సప్లయ్ చేస్తాడంటూ పోస్టర్లతో తప్పుడు ప్రచారం చేశారు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలోని కె ఏనుగుపల్లిలో జరిగింది.

బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయిరామ్, శేషయ్యలు స్నేహితులు. వారి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఒకరి పైన మరొకరు విష ప్రచారానికి సిద్ధపడ్డారు.

అమలాపురం బస్ స్టేషన్లో అతికించి ఉన్న స్టిక్కర్‌ను పోలీసులు గమనించారు. అందులో రిసార్టులో అమ్మాయిలు సప్లై చేయబడును. అంటూ వివరాలు ఇచ్చారు. అందులో తన శత్రువు పేరు రాసి, అతడి ఫోన్ నెంబర్లు ఉంచారు.

 Conflict between two friends, posters against friend

దీనిపై పోలీసులు లోతుగా ఆరా తీశారు. ఇద్దరు స్నేహితుల బృందాలకు చెందిన పేర్లను సేకరించిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఒకరి పైన మరొకరు విషప్రచారంలో భాగంగా ఇది జరిగిందని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

కృష్ణా నదిలోకి స్నానంకు వెళ్లి ముగ్గురు మృతి

కృష్ణా నదిలో స్నానానికి అని వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తాడేపల్లి సీతానగరం వద్ద చోటు చేసుకుంది. ఆరుగురు విద్యార్థులు స్నానం కోసం వెళ్లారు. అందులో సుభాష్, సాయికృష్ణ, శ్రీకాంత్ అనే విద్యార్థులు మృతి చెందారు. మిగతా ముగ్గురు విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. వారు విజయవాడలోని ఓ కళాశాలలో చదువుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+