కాంగ్ చావదు, మేం తిట్టుకోవచ్చు: జెసి వ్యాఖ్యపై ఆనం

మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యల పైన ఆయన స్పందించారు. జెసి వ్యాఖ్యల పైన ఆయననే అడగాలన్నారు. అయితే కాంగ్రెసు పార్టీ చస్తుందన్న వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. కాంగ్రెసు గరికపోచ వంటిదన్నారు. వరద వస్తే వాలిపోయి తర్వాత లేచి నిలబడుతుందన్నారు.
తాము కాంగ్రెసు పార్టీలో ఉంటూనే సమైక్యాంధ్ర కోసం పాటుపడుతామని చెప్పారు. తమ నినాదం సమైక్యవాదమేనని, తుది గెలుపు మాదే అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో పంథాలో వెళ్తుంటారన్నారు. ఏ పంథాలో వెళ్లినా సమైక్యం కోసం వారికి మద్దతిస్తామన్నారు. కాంగ్రెసు పార్టీలో ఓ తప్పు జరిగినంత మాత్రాన అధిష్టానాన్ని తిట్టవద్దన్నారు. అయితే, అధిష్టానం, తాము తిట్టుకోవచ్చునన్నారు. తెలుగుతల్లిని అనాథగా వదిలేసే ప్రసక్తి లేదని, చివరిదాకా పోరాడుతామన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీలోనే ఉంటారని, కొత్త పార్టీ పెట్టే అవకాశమే లేదన్నారు. కిరణ్ కుటుంబమే కాంగ్రెసు పార్టీ కుటుంబమన్నారు. అలాంటి వ్యక్తి కొత్త పార్టీ పెడతారనే మీ కల నెరవేరదన్నారు. అవన్నీ ఊహాజనిత ప్రశ్నలేనని ఆనం వివేకానంద రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications