దంపతుల ఆత్మహత్యాయత్నం, భర్త మృతి

ఇటీవల వ్యాపారంలో నష్టం రావడం వవల్ల, వివాహం జరిగి 14 ఏళ్లు గడిచినా సంతానం కలగకపోవడం వారిని క్రుంగదీసింది. దాంతో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. రాత్రి ఇంట్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్త అక్కడికక్కడే మరణించాడు. మాధవి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
కారు ప్రమాదంలో ఐదుగురు మృతి
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లాలోని మేడిపల్లి జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఘటనా స్థలంలో ఇద్దరు మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించారు. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు. మరో పది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఓ స్కార్పియో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందినవారని తెలుస్తోంది. షిరిడి నుంచి వరంగల్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications