టిడిపి సవాలును ఆహ్వానిస్తున్నాం:సిపిఎం;ఎపిలో అవినీతి రాజ్యమేలుతోంది:సిపిఐ

అమరావతి:భూ సమీకరణ పద్దతిని సమర్థిస్తూ టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ బహిరంగ చర్చకు రావాలని కోరడాన్ని సీపీఎం ఆహ్వానిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ఓ ప్రకటనలో తెలిపారు.

చర్చపై నిజంగా టిడిపి నాయకత్వానికి విశ్వాసం ఉంటే వెంటనే అఖిలపక్ష సమావేశం వేసి చర్చించాలని ఆయన ఆ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో చేయడం చట్టవ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో ఆమోదించిన భూసేకరణ చట్టం 2018 కేంద్ర చట్టానికి పూర్తిగా భిన్నంగా ఉందని సిపిఎం మధు ప్రకటనలో పేర్కొన్నారు.

CPM,CPI fires on Chandra babu and Modi

అనంతరం సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు కు తాను రాసిన లేఖను సిపిఎం మధు మీడియాకు విడుదల చేశారు. ఉల్లిని క్వింటాకు రూ.1500 చొప్పున చెల్లించి మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చంద్రబాబుకు రాసిన ఆ లేఖలో మధు పేర్కొన్నారు. ఉల్లికి గిట్టుబాటు ధరలు లభించక రైతులు క్వింటా రూ.800లోపే అమ్ముకోవాల్సి వస్తోందని ఆయన వివరించారు. ఇటీవల కర్నూలులో ఆత్మహత్య చేసుకున్న ఉల్లి రైతు కుటుంబానికి రూ.5లక్షలు నష్టపరిహారం అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

మరోవైపు సిపిఎం,సిపిఐ ఉమ్మడిగా చేపట్టిన బస్సుయాత్ర కడప చేరుకున్న సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు. విభజన హామీల అమలు, కడప ఉక్కు, ప్రత్యామ్నాయ రాజకీయ సంబంధాలు, రైల్వేజోన్‌ అంశాలతో సీపీఐ, సీపీఎం చేపట్టిన బస్సుయాత్ర సోమవారం కడపకు చేరుకోగా...ఈ సందర్భంగా పాత కలెక్టరేట్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో సిపిఐ రామకృష్ణ మాట్లాడారు.

Recommended Video

    పార్టీ కార్యాలయానికి ప్రతి మంత్రి అందుబాటులో ఉండాలి: చంద్రబాబు

    ఎన్నికలకు ముందు అందరికీ అండగా ఉంటానన్న చంద్రబాబు అధికారం చేపట్టాక ఎక్కాక అవినీతిని పెంచిపోషించారని ఆరోపించారు. పేదల పరిస్థితి ఏమాత్రం మారలేదని, శాసనసభ్యులు కోట్ల రూపాయలు గడిస్తున్నారని చెప్పారు. విజయవాడలో మృతదేహాలకు పోస్టుమార్టం చేయటానికి రూ.5వేలు లంచం కోరుతున్నారంటే అవినీతి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోందన్నారు. మరోవైపు జగన్‌ సీఎం కుర్చీ కోసం తహతహలాడిపోతున్నారని చెప్పారు.

    రాష్ట్రంలో సరికొత్త ప్రత్యామ్నాయాన్ని జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌తో కలిసి నిర్మిస్తామని సిపిఐ రామకృష్ణ తెలిపారు. ప్రధాని మోడీ ఏపీని ఆదుకుంటానని చెప్పి దారుణంగా దగా చేశారని...చంద్రబాబు, మోడీలను వచ్చే ఎన్నికల్లో సాగనంపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం విడుదల చేసిన ఒక ప్రకటనలో
    తూర్పుగోదావరి జిల్లాలో డెంగీ జ్వరాలను అరికట్టేందుకు తక్షణం ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్‌ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు 258 డెంగీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+