కెసిఆర్‌లో స్వార్థం పెరిగింది: డిఎస్, శ్రవణ్‌కి పోస్ట్‌పై అలక

నిజామాబాద్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావులో స్వార్థం పెరిగిందని, ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నారని మాజీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు డి శ్రీనివాస్ శనివారం విమర్శించారు. సమైక్యవాదులకు తెరాస టికెట్లు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని సిఎం చేస్తానని చెప్పి మాట తప్పిన తెరాస నేతలను దళితులు నిలదీయాలని డిఎస్ పిలుపునిచ్చారు.

శ్రవణ్‌కు పదవిపై అసంతృప్తి

కాంగ్రెస్‌లో చేరిన దాసోజు శ్రవణ్ కుమార్‌‍కు తెలంగాణ పిసిసి ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించడంపై తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో చేరగానే అధికార ప్రతినిధి ఎలా ఇస్తారని అధికార ప్రతినిధి నిరంజన్ ప్రశ్నించారు. శ్రవణ్‌ను పదవి నుంచి తప్పించకపోతే తాము రాజీనామా చేస్తామని నిరంజన్ హెచ్చరించారు.

D Srinivas blames K Chandra sekhar Rao

పాల్వాయికి వార్నింగ్

మునుగోడు నుంచి కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేసిన కుమార్తె స్రవంతితో నామినేషన్ ఉపసంహరింపచేయాలని కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కేంద్ర మంత్రి జైరాం రమేష్ సూచించారు. శనివారం ఉదయం పాల్వాయ్‌తో జైరాం సమావేశమయ్యారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా జైరాం రమేష్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+