బాబు వార్న్: అధిష్టానానికి దగ్గుబాటి షాక్, తిరస్కారం

మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తన అలకను వీడలేదు. రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఇష్టపడలేదు. మరో పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆయనను కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని మోత్కుపల్లి తిరస్కరించారు.
దగ్గుబాటి తిరస్కరణ ఓటు
కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సతీమణి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కాంగ్రెసు పార్టీ పైన తిరుగుబావుటా ఎగురవేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పార్టీ సూచించినట్లుగా ఏ అభ్యర్థికి ఓటు వేయలేదు. తొలిసారి ప్రవేశ పెట్టిన తిరస్కరణ ఓటును (నోటా)ను ఆయన ఉపయోగించుకున్నారు. కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేదు. దీనిని ఆయన ఉపయోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో సీమాంధ్రులకు అన్యాయం జరుగుతోందని అందుకే తాను తిరస్కరణ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనకు కారణాలు చెప్పాల్సి ఉందన్నారు. విభజనపై రెండో ఎస్సార్సీ వేయాల్సి ఉండెనని భావించారు.












Click it and Unblock the Notifications