వచ్చి చెప్పు: పురంధేశ్వరికి దేవినేని సవాల్, జగన్ పైనా

నవంబరు నెలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రాజీనామా చేయించి కొత్త పార్టీ పెట్టించాలని యోచిస్తున్నారన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి పన్నెండు వందల కోట్ల రూపాయలను కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నాయకులు అంగీకరించారని ఆరోపించారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు మీడియా ముందుకు వచ్చి డ్రామాలు చేస్తున్నారని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ స్క్రిప్ట్ ప్రకారమే ముఖ్యమంత్రి, ఎంపీలు, వైయస్ జగన్‌లు డ్రామాలు ఆడుతున్నారన్నారు.
ఢిల్లీ పెద్దలను టిడిపి కదిలించింది: టిడిపి
సీమాంధ్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్ష, టిడిపి శ్రేణుల ఆందోళన ఢిల్లీ పెద్దలను కదిలించిందని గుంటూరు టిడిపి నేతలు పత్తిపాటి పుల్లారావు, శ్రీధర్, ఆనంద్ బాబులు అన్నారు.
బాబు దీక్షకు జాతీయ నేతలు మద్దతు తెలపడంతో సోనియా గాంధీ పునరాలోచనలో పడ్డారన్నారు. సమైక్యం ముసుగులో విభజన కోరే వారిలో మొదటి వ్యక్తి జగన్ అయితే రెండో వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి పథకం ప్రకారమే సమ్మెను నీరుగార్చుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications