దమ్ముంటే పులివెందుల్లో ఓదార్పు: జగన్‌కు దేవినేని ఉమ సవాల్
హైదరాబాద్: దమ్ముంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పులివెందుల నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సవాల్ చేశారు. పులివెందులకు నీరిచ్చి చంద్రబాబు ఆదుకున్నారా, లేదా అని జగన్‌కు ఓదార్పు యాత్ర చేస్తే తెలుస్తుందని ఆయన శుక్రవారంనాడు అన్నారు.
ముద్దాయి జగన్ ప్రశ్నలు వేస్తే తాము సమాధానాలు చెప్తామని, ముద్దాయి ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి, ప్రజలు వినాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. వైయస్ జగన్‌కు సమాధానం చెప్పే సత్తా, ధైర్యం తమకు ఉన్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుట్రలను ఎదుర్కుంటామని ఉమ చెప్పారు.
కమిషన్లకు కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం చేశారని దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. ఏజెన్సీలు పోలవరం పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన సూచించారు. పనులు ప్రారంభించకపోతే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలవరం పనులను వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై అవిశ్వాస నోటీసు విషయంలో నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం సభలో మాట్లాడుతూ శాసనసభలో ప్రతిపక్షం అగౌరవంగా వ్యహరిస్తోందని మండిపడ్డారు. వాకౌట్ చేస్తున్నామని చెప్పకుండానే ప్రతిపక్ష నేత జగన్ తన సహచరులతో కలిసి బయటకు వెళ్లారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
అరాచక ప్రతిపక్షం లేకపోవం వల్ల సభలో అర్థవంతమైన చర్చ జరుగుతోందని మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. శుక్రవారం శాసనసభలో మాట్లాడుతూ అయితే ప్రతిపక్షం ఉండాలని వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పీకర్ కోడెల అన్నారు.












Click it and Unblock the Notifications