అసెంబ్లీలో చించేస్తాం, మెరుపు దాడులు చేస్తాం: దేవినేని

Devineni Umamaheswara Rao
విజయవాడ: అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే దానిని అక్కడే చించేస్తామని, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల పైన మెరుపు దాడులు చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం అన్నారు. ఆయన కృష్ణా జిల్లా విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే సభలోనే బిల్లును చించేస్తామన్నారు. బిల్లు వస్తే ఐదు రాష్ట్రాల విద్యుత్తు సరఫరాను స్తంభింప చేస్తామని హెచ్చరించారు. రైలు పట్టాలపై వంటావార్పులు చేస్తామని, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై మెరుపు దాడి చేస్తామని పేర్కొన్నారు.

2014 ఎన్నికలలో తెరాస, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు గోరీ కట్టేలా ఉద్యమం తెస్తామన్నారు. విభజన బిల్లుపై జగన్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసి కాంగ్రెస్ నాటకానికి సహకరిస్తుందన్నారు. బిల్లువస్తే లక్షలాది ప్రజలు ఆందోళనకు దిగటం ఖాయమన్నారు.

కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ముప్పై ఏళ్లుగా పదవులు అనుభవిస్తూ వందల కోట్ల రూపాయలు ఆర్జించుకుని సమైక్యాంధ్ర ద్రోహిగా మారాడన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, దివంగత రాజీవ్ గాంధీలను బండ బూతులు తిట్టి, ఆ పార్టీ పంచన చేరి పదవులు పొందటం జైపాల్ దృష్టిలో సమన్యాయమన్నారు. మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సమైక్యద్రోహి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+