ఎవర్నీ అరెస్ట్ చేయలేదు: డిజిపి, సికె బాబు..! అనురాధ హత్యలో కొత్త కోణం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో రాష్ట్ర డిజిపి జేవీ రాముడు శుక్రవారం నాడు ఆసక్తికర విషయం చెప్పారు. మేయర్ దంపతుల హత్య కేసులో తాము ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు.
ఈ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అనుచరులపై కూడా అనుమానాలు ఉన్నాయని ఆయన చెప్పారు. హత్యకేసులో నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

ఘటనలో పాత్రధారుల కన్నా, వారి వెనకుండి నడిపించినవారే ముఖ్యమని ఆయన చెప్పారు. అనుమానితులను అందర్నీ ప్రశ్నిస్తున్నామని డిజిపి చెప్పారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చింటూ లొంగిపోయినట్టుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు.
కాగా, చిత్తూరు నగర మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ రెండు రోజుల క్రితం దుండగుల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ హత్యలో మోహన్ మేనల్లుడు చింటూ పాత్ర పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సికె బాబు పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications