అందర్నీ నిరాశపర్చావు: చంద్రబాబుపై ట్విట్టర్‌లో దిగ్విజయ్ విమర్శలు

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా విషయలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర శంకుస్థాపన వేదికపై ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

Digvijay fires at Chandrababu

ఈ మేరకు ట్విట్టర్‌లో ‘చంద్రబాబు ప్రజలందరినీ నిరాశపరిచారు' అని పేర్కొన్నారు. శనివారం ఆయన ట్విట్టర్‌లో చంద్రబాబుపై పలు విమర్శలు సంధించారు.

‘పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా అమలు చేయకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్లను విస్మరించారు' అని దిగ్విజయ్ పేర్కొన్నారు.

అంతేగాక, ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. దాని కోసం పోరాటం చేస్తుంది. చంద్రబాబు కనీసం రాజధాని శంకుస్థాపన వేడుకలో ప్రత్యేక హోదాపై డిమాండైనా చేయలేదు. యూ డిస్సప్పాయింటెడ్ అజ్ బాబూ' అంటూ దిగ్విజయ్ ట్వీట్టర్లో వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+