సీఎం వైఎస్ జగన్ సినిమా ‘వ్యూహం’
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎపుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరూ చెప్పలేరు. మనసులో ఏది ఉంటే ఆ విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. దాన్నే ఆర్జీవి మార్క్ స్టైల్ అని పిలుస్తుంటారు. కొన్నేళ్లుగా వర్మ తన చేతలతో, వ్యాఖ్యలతో వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు. అతను ఏం చేసినా సంచలనం అవుతోంది. ఏమీ చేయకుండా కామ్ గా ఉన్నా ఏదో ఒక సంచలనానికి తెరలేపుతున్నట్లే.
మన మనసులో ఉన్న విషయాలను ఉన్నది ఉన్నట్లుగా ఎలా చెప్పాలో వర్మను చూసి నేర్చుకోవాలి. చేసే సినిమాలతో సంచలనం సృష్టించిన వర్మ తాజాగా చెత్త సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని ఎంచుకోవడం, దాన్ని సినిమాగా తీయడం ఆయన శైలిగా మారింది. 'వ్యూహం' పేరుతో రాజకీయ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు. ఆలోచనకు, అహంకారానికి మధ్య జరిగే యుద్ధం అంటూ క్యాప్షన్ కూడా చెప్పారు.

త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. బయోపిక్ కాదని, కానీ అంతకన్నా లోతైన రియల్ పిక్ అన్నారు. వందకు వంద శాతం నిజాలే ఉంటాయన్నారు. ఈ చిత్రానికి 'వ్యూహం' అనే పేరు ఖరారు చేశారు. జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస నటించబోతున్నారు. అజ్మల్ విషయానికొస్తే.. ఈయన గతంలో వర్మ తెరకెక్కించిన 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించారు. ఇపుడు మరోసారి వైఎస్ జగన్ పాత్రలో నటించడం విశేషం. 'అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం' ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. త్వరలో ఇతర వివరాలను ప్రకటిస్తామని చెప్పారు












Click it and Unblock the Notifications