వైసీపీకి కొత్త ఉత్సాహం: పార్టీలో చేరిన డీఎల్ రవీంద్రా వర్గీయులు
శుక్రవారం నాడు వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో కాజీపేట జడ్పీటీసీ లక్ష్మీదేవితో పాటు మరో ఆరుగురు ఎంపీటీసీలు పార్టీలో చేరారు.
కడప: వైసీపీలోకి చేరికలు ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వర్గీయులు వైసీపీలో చేరారు. శుక్రవారం నాడు వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో కాజీపేట జడ్పీటీసీ లక్ష్మీదేవితో పాటు మరో ఆరుగురు ఎంపీటీసీలు పార్టీలో చేరారు.
పార్టీని మరింత బలోపేతం చేయడానికి తామంతా కృషి చేస్తామని అన్నారు. ఇదిలా ఉంటే, గతంలో వైసీపీని వీడిన ఆరుగురు కార్పోరేటర్లు సైతం తిరిగి సొంతగూటిలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు నేతృత్వంలో వారు తిరిగి పార్టీలో చేరారు.

జగన్ జిల్లా పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలోనే వీరంతా పార్టీలో చేరడం గమనార్హం.












Click it and Unblock the Notifications