రాజధాని: దొనకొండ కోసం జగన్ ఎమ్మెల్యే, మంత్రి నో
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని దొనకొండలో ఏర్పాటు చేసే యోచన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని, శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రాజధాని ఎంపిక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.
దొనకొండలో 10,213 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు. దొనకొండ వద్ద పారశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలు పెండింగ్‌లో లేవన్నారు. అంతకు ముందు జగన్ పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కూడా బాగలేదంటున్నరన్నారు. రాయలసీమ, కోస్తా జిల్లాలకు మధ్యలో ప్రకాశం జిల్లాలో దొనకొండలో విస్తారంగా భూములు ఉన్నాయన్నారు. దర్శి బ్రాంచి కెనాల్ కూడా అందుబాటులో ఉందన్నారు. ఈ ప్రాంతానికి తాగునీటి సదుపాయం అందుబాటులో లేదనే ఆరోపణలో పసలేదన్నారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన విమానాశ్రయం కూడా ఉందన్నారు.
సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో దొనకొండ ప్రాంతం ఉందన్నారు. రాజధానికి అత్యటంత అనువైన ప్రదేశమని, భూమి లభ్యత బాగుందన్నారు. భూమి కొనుగోలుకు ఖర్చు ఉండదన్నారు. సింగపూర్, మలేషియా తరహాలో రాజధానిని నిర్మిస్తామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దొనకొండను రాజధాని చేసే విషయాన్ని పరిశీలించాలన్నారు.












Click it and Unblock the Notifications