జంట దారుణ హత్య: సంచీలో మహిళ శవం

Double murder in Karimagar district
కరీంనగర్/ హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మహాముత్తారం మండలం మబబూబ్‌పల్లిలో జంటను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అదే గ్రామానికి చెందిన వసంత అనే మహిళను, సురేష్ అనే యువకుడిని అత్యంత దారుణంగా నరికి చంపారు.

ఆ సంఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైవాహికేతర సంబంధమే ఈ హత్యలకు కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

కాగా, కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్‌బిఐలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించి, తుపాకితో బెదిరించి 40 లక్షల రూపాయలు దోచుకుని వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పుప్పాలగుడాలో ఓ ఇంట్లో సంచీలో మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+