వైభవంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రులు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ మహాలక్ష్మీ అవతారంలో భక్తుల పూజలు అందుకుంటోంది. తెల్లవారుజామునుంచే ఆలయం కిటకిటలాడుతోంది. మహాలక్ష్మిని అర్చిస్తే సకల సుఖాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దసరా మహోత్సవాలైన ఏడో రోజైన శుక్రవారం కనకదుర్గమ్మ మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిచ్చింది. కనకదుర్గను లలితాదేవిగా కొలవాలని ఆదిశంకరాచార్యలు ఎనిమిదో శతాబ్ధంలో ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ట చేసి చూచించారు. నాటి నుంచి లలితగా కనకదుర్గమ్మ పూజలు అందుకుంటోంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఏపీ మంత్రి పల్లె రఘనాథ రెడ్డి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, రాజమహేంద్రవరం ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+