ఏపీ కొత్త లక్ష్యం: ఒకే గొడుగు కిందకు 33 శాఖలు (ఫోటోలు)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రగతి పేరుతో వినూత్న ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్టు పల్లె రఘనాథ రెడ్డి వెల్లడించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం శనివారం సెక్రటేరియట్‌లో జరిగింది. అనంతరం సమావేశ వివరాలను మంత్రులు పల్లె రఘానాథ్‌రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, వివిధ శాఖల సమాచారాన్ని కంప్యూటరైజ్ చేసి అన్ని శాఖలను ఒకేగొడుగు కిందకు తేవడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. 33శాఖలు, 315 హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్లు (హెచ్‌ఓడి), 745 ఈ-సేవలను ఒకే పరిధిలోకి తీసుకురావడమే కొత్త ప్రాజెక్టు లక్ష్యమన్నారు. మొత్తం 72 ప్రాజెక్టులను 14 ప్యాకేజీలుగా విభజించి ఈ-ప్రగతి పథకాన్ని అమలు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా ప్రాజెక్టు లేదని, 126 దేశాల్లో కేవలం 10 దేశాలు మాత్రమే ఈ తరహా ప్రాజెక్టును అమలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు క్యాంపెయిన్‌లు ఈ-ప్రగతి పరిధిలోకి వస్తాయని ప్రకటించారు. ఈ-గవర్నెన్న్‌ను అమలు చేస్తున్న దేశాల్లో భారత్ స్థానం 118వ స్ధానంలో ఉందన్నారు.
తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఈ-ట్రాన్సాక్షన్స్‌గా ఉంటాయని, భారత్‌లోనే కాకుండా, దక్షిణాసియాలోనే నెంబర్ వన్‌గా ఏపీకి పేరు వస్తుందన్నారు. ఈ-ప్రాజెక్టు అమలు చేసేందుకు 2,358 కోట్లు అవసరమని, ఇందులో 1528 కోట్లు ప్రభుత్వం భరిస్తుండగా, మిగతా మొత్తాన్ని ఇతర సంస్థలు భరిస్తాయన్నారు. మూడేళ్లలో మూడు దశల్లో ప్రాజెక్టు అమలవుతుందని వివరించారు.
ఇక ఏపీలో రుణ బాధలతో గత 15 నెలల కాలంలో 37మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల సంఖ్యను వివిధ పార్టీలకు చెందినవారు వేరువేరుగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు. వాస్తవంగా గత 15నెలల కాలంలో ఏపీలో రుణాలతో 37మంది రైతులు మాత్రమే ఆత్మహత్యలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు.

ఏపీ కొత్త లక్ష్యం: ఒకే గొడుగు కిందకు 33 శాఖలు
ఇతర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన వారు కూడా ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. అయితే ఆ వివరాలు తమవద్ద లేవన్నారు. 2015 ఫిబ్రవరి 19 తర్వాత మరణిచిన రైతులకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లిస్తున్నామని, ఇందులో 1,50,000 రూపాయలు రుణవిమోచన కోసం ఇస్తూ, మిగతా భాగాన్ని సదరు రైతు కుటుంబీకుల పేర్లతో డిపాజిట్ చేస్తున్నామన్నారు.

ఏపీ కొత్త లక్ష్యం: ఒకే గొడుగు కిందకు 33 శాఖలు
డిపాజిట్‌పై వచ్చే వడ్డీని రైతు కుటుంబానికి రెగ్యులర్‌గా అందేలా చూస్తున్నామన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నట్టు 2013-14లో మరణించిన రైతులకు ఈ విధానం వర్తించదని స్పష్టం చేశారు. వీరికి కూడా ఐదు లక్షల రూపాయల సాయం వర్తిస్తుందని అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారం వల్ల పొరపాటున అసెంబ్లీలో ప్రకటన చేశానని గుర్తు చేశారు.

ఏపీ కొత్త లక్ష్యం: ఒకే గొడుగు కిందకు 33 శాఖలు
అనంతపురం జిల్లా పాలసముద్రం గ్రామంలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉత్పత్తి చేసే ఇన్నోవేటివ్ (ప్రై) లిమిటెడ్ కంపెనీకి 264 ఎకరాల భూమి కేటాయిస్తూ మంత్రివర్గం తీర్మానించిందని మంత్రులు తెలిపారు. 450 కోట్ల పెట్టుబడితో ఐదేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టులో 2,500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇందులో ఏపీఐఐసికి 26శాతం వాటా ఉంటుందన్నారు.

ఏపీ కొత్త లక్ష్యం: ఒకే గొడుగు కిందకు 33 శాఖలు
ఇక విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కాపులపాడు గ్రామంలో యూనిటెక్ సంస్థకు 2009లో 1550 ఎకరాల కేటాయించారని, ఈ అగ్రిమెంట్‌ను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఈ భూమిని ఇతర అవసరాలకు వాడుతామన్నారు. మచిలీపట్నం పోర్ట్‌కోసం 2010లో అగ్రిమెంట్ జరిగిందని, ఇందుకు 5324 ఎకరాలు సేకరించి ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 524ఎకరాలు మాత్రమే ఇచ్చారని, మిగతా భూమిని సేకరించి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు.












Click it and Unblock the Notifications