నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు: చిరంజీవిపై కోడిగుడ్లు
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి పైన భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు కోడిగుడ్లు విసిరారు. చిరంజీవి కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఓ ప్రాంతంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని హిట్లర్, క్రూరుడు అనడంతో బిజెపి మద్దతుదారులు రెచ్చిపోయారు. ఈ ఘటన తర్వాత ప్రచారాన్ని కాసేపు నిలుపు చేశారు. అనంతరం పోలీసులు బిజెపి మద్దతుదారులను చెదరగొట్టారు. గుడ్లు విసిరిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, అంతకుముందు చిరంజీవి మాట్లాడుతూ... సీమాంధ్రులది కష్టపడేతత్వమన్నారు. కృష్ణా జిల్లాలో ప్రచారంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర విభజన వల్ల మంచే జరిగిందని, రెక్కలు ముక్కలు చేసుకునే ప్రజలు ఇక్కడ ఉన్నారని అన్నారు.
సీమాంధ్రుల్లో అక్రమంగా సంపాదించేద్దామనే ఆలోచన తక్కువ అని, అందరూ కష్టపడతారని తెలిపారు. రాష్ట్రాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే అవకాశం మనకు దక్కినందుకు ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రులే ఎక్కువ లాభపడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications