గోతిలో పడిన ఏనుగు పిల్ల: రక్షించిన అధికారులు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో తాగునీటి కోసం వచ్చిన ఏనుగు పిల్ల గోతిలో చిక్కుకుపోయింది. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం కాలువపల్లె సమీపంలోని ఐదు కిలోమీటర్ల నుంచి తాగునీటి కోసం వచ్చిన ఓ ఏనుగుల గుంపులో ఏడాది వయసున్న ఏనుగు పిల్ల అక్కడే ఉన్న దొనలో పడిపోయింది.
మిగిలిన ఏనుగులు ఆ పిల్లను బయటకు లాగలేక వెనుదిరిగాయి. పది అడుగుల లోతు ఉన్న నీటి కుంటలో పడిపోయిన ఏనుగు పిల్ల అరుస్తుండడం గమనించిన పశువుల కాపరులు పలమనేరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

అటవీ శాఖ సిబ్బంది నీటి కుంటలో పడిన ఏనుగు పిల్లను తాళ్లతో పైకిలాగి రక్షించారు. పశువైద్యాధికారులతో పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత అడవిలో ఏనుగుల గుంపులో వదిలేసినట్లు ఎఫ్‌ఆర్‌ఒ బాలవీరయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications