టీడీపీ నేతలు 20 మందితో లిస్ట్.. త్వరలో ఈడీ దాడులు?
తెలుగుదేశం పార్టీకి చెందిన 20 నేతలతో ఒక జాబితా తయారైందని, వీరిపై త్వరలోనే ఆదాయపు పన్నుశాఖ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన దాదాపు 30 మంది నేతలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. వీరిలో జయభేరి మురళీమోహన్, బీద రవిచంద్రకు చెందిన వ్యాపార సంస్థలు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన వ్యాపార సంస్థలతోపాటు మరికొందరు నేతల కార్యాలయాలపై దాడులు జరిగాయి.
ఈ దాడులవల్ల తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాల్లో తాను అనుకున్న పనులు చేయలేకపోయింది. ఎన్నికలకు ముందు పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేలా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించిందని తెలుగు తమ్ముళ్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.

కొద్దిరోజుల క్రితం జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి ఇళ్లల్లో దాడులు జరిగిన సంగతి తెలిసిందే. పెద్దల మద్దతుతోనే దాడులు జరిగాయని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వారికి అధికారంలో ఉన్న వైసీపీ కూడా సహకరించిందంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై దూకుడుగా వెళుతున్న ప్రభాకర్‌రెడ్డిని అదుపు చేయడానికే ఈడీ దాడులు జరిగాయనే వాదన ఉంది.
ఈడీ రంగప్రవేశం వెనక ఎవరు ఉన్నారు? ఈ దాడులు చేయించింది ఎవరు? అనే విషయాలు త్వరలోనే బయట పడతాయని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మరో 20 మంది నేతలపై కూడా ఈడీ దాడులకు సిద్ధంగా ఉందనే సమాచారం ఉందని, సదరు నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఈడీ దాడికి రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని, గతంలో జరిగిన ఒక కేసుకు సంబంధించి మాత్రమే దాడులు చేశారని వైసీపీ నేతలంటున్నారు. ఇందులో వాస్తవాలేంటనేది త్వరలోనే బయటకు వస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications