ప్రకాశం జిల్లాలో బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య
అమరావతి: బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలెంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. మృతురాలు అనూష ఒంగోలుకు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోందని పోలీసులు గుర్తించారు.

అనూష ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్ధానికులు చెబుతున్నారు. చదువు విషయంలో ఆమెపై ఉన్న ఒత్తిడే ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిందని తెలుస్తోంది. కాగా, ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు, కుటుంబ సభ్యులు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆత్మహత్యగా కేసును నమోదు చేసుకున్నారు.
కేవలం ఒత్తిడా లేక మరేమైన కారణాలున్నాయి అన్న విషయమై పోలీసులు విచారణ దర్యాప్తు జరుపుతున్నట్టు వివరించారు.












Click it and Unblock the Notifications