భవనంపై నుంచి పడి మృతి: ఇంజనీరింగ్ విద్యార్థిని కొట్టి చంపారా?
విజయవాడ: నెల్లూరు జిల్లాలోని కావలిలో గల ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థి మరణించాడు. హాస్టల్ భవనంపై నుంచి దూకి అతను మరణించాడు. విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాలలో సిఈఈ చదువుతున్న శివకుమార్ గురువారం రాత్రి భవనంపై నుంచి కిందపడిన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. తమ కుమారుడిని కొట్టి చంపారని వారు అనుమానం వ్యక్తం చేశారు. శివకుమార్ స్వగ్రామం అనంతసాగరం మండలం గొల్లపల్లి.

సెల్‌ఫోన్‌పై గొడవతో విద్యార్థి ఆత్మహత్య
సెల్‌ఫోన్ విషయయంలో స్నేహితులతో గొడవపడి ఓ విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని లయోలా కాలేజీలో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన కమల్ జైన్ లయోలా కళాశాల హాస్టల్‌లో ఉండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
గురువారంనాడు సెల్‌ఫోన్ విషయంలో అతనితో మిత్రులకు గొడవ జరిగింది. ఈ స్థితిలో తీవ్ర మనస్తాపానికి గురైన కమల్ జైన్ హాస్టల్ గదిలో ఉరేసుకుని మరణించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications