'టిలో చానళ్ల బ్యాన్‌లో జగన్ హస్తం': కేసీఆర్‌కు హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాల నిలిపివేత పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు సోమవారం మండిపడ్డారు. ఉదయం చానళ్ల ప్రసారాల నిలిపివేతకు వ్యతిరేకంగా బషీర్‌బాగ్ వద్ద జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. చానళ్ల ప్రసారాలు నిలిపి వేయడంలో కేబుల్ ఆపరేటర్లను తాము తప్పుబట్టడం లేదని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుది ఒంటెద్దు పోకడ ధ్వజమెత్తారు. కేసీఆర్ మీడియా స్వేచ్ఛను మంటగలుపుతున్నారన్నారు.

కేసీఆర్ మూర్ఖపు చర్యలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇందులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందన్నారు. జగన్ అక్రమాస్తులను బయటికి తెలియజేయడంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 చానెళ్ల పాత్ర ఉందని, అందుకే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
తెలంగాణలో చానెళ్ల ప్రసారాలు నిలిపివేత సరికాదని టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో మనల్ని విమర్శించే వాళ్లు... ప్రశంసించేవాళ్లు ఉండాలన్నారు. చానళ్ల ప్రసారాల నిలిపివేత విషయంలో తెరాస ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలే తిరగబడతారని నర్సారెడ్డి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications