జనాలపై దూసుకెళ్లిన ఏపి మంత్రి ఎస్కార్ట్: ఒకరి మృతి

సోమవారం తెల్లవారుజామున మంత్రికి విజయవాడ వరకు ఎస్కార్ట్‌గా వెళ్లిన వాహనం తిరిగివస్తూ అదుపుతప్పి మచిలీపట్నం చల్లరాస్తా వద్ద విజయవాడ-మచిలీపట్నం ప్రధాన రహదారి పక్కన ఓ ఇంటి ముందు ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో స్థానికంగా ఓ దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
గాయపడిన మరో ఇద్దరు స్థానికులు మచిలీపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో పోలీసు వాహనం బోల్తా పడటంతో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications