వివాహేతర సంబంధం: నడివీధిలో వివస్త్రను చేశారు
అనంతపురం: జిల్లాలోని గుంతకల్లు మండలం పులికొత్తపల్లి చిన్నతండాలో శనివారం దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో ఓ మహిళను నడివీధిలో కొందరు మహిళలు వివస్త్రను చేశారు.
తన భర్తతో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్నందున తాను అనేక విధాలుగా అన్యాయానికి గురవుతున్నానని ఓ వివాహిత గ్రామంలోని మిగతా మహిళలకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన మహిళలంతా కలిసి ఆమెను వివస్త్రను చేశారు. కాగా, మహిళ అని కూడా చూడకుండా వివస్త్రను చేయడం పలువురు సదరు మహిళలపై మండిపడుతున్నారు.

వివాహిత అనుమానాస్పద మృతి: అత్తింటివారిపై దాడి
తమ కుమార్తె మౌనిక మృతికి భర్త, అత్త కారకులని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు అత్తింటివారిపై దాడికి దిగారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా టి.గూడూరు మండలం పాపిరెడ్డిపాలెంలో మౌనిక అనే వివాహిత మార్చి 15న అత్తవారింట్లో మరణించింది.
భర్త అశోక్, అత్త సుబ్బమ్మ దారుణంగా కొట్టడం వల్లే మౌనిక మరణించిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు శనివారం దాడికి దిగారు. అశోక్ ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి చేసి ఫర్నీచర్, ఇతర వస్తువులను వారు ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు.












Click it and Unblock the Notifications