కెసిఆర్‌ను కడిగేసిన పొన్నాల, గాంధీభవన్ వద్ద బౌన్సర్లు

రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమన్నారు. విశ్వసనీయతకు మారుపేరు కాంగ్రెసు పార్టీ అన్నారు. కాంగ్రెసు పార్టీ సదా విశ్వసనీయతకు కట్టుబడి ఉందన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్నట్లు ఉందన్నారు.
ముప్పై ఏళ్లు రాజకీయాల్లో ఉన్న కెసిఆర్ అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న కెసిఆర్ మెదక్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కెసిఆర్ అడ్డుపడుతున్నారన్నారు. మాటపై నిలబడని వ్యక్తి కెసిఆర్ అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదన్నారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెసు మాత్రమే అన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. బంగారు తెలంగాణ కోసం కాంగ్రెసు పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. అవినీతి గురించి కెసిఆర్ మాట్లాడటం విడ్డూరమన్నారు. ఎన్నికల పర్యవేక్షణకు గాంధీ భవన్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పేదలకు భూ పంపిణీపై కెసిఆర్ హామీ అమలు అసాధ్యమన్నారు.
కాగా, తెరాసతో పొత్తుకు తమ ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. కుటుంబానికి ఒక్క సీటు ఇవ్వాలనే నిబంధన లేదని పొన్నాల చెప్పారు. టిక్కెట్ల విషయంలో మొదటి ప్రాధాన్యత గెలుపు అని, ఆ తర్వాత సామాజిక కోణమని చెప్పారు. సిట్టింగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు.
గాంధీ భవన్ వద్ద బౌన్సర్లు
గాంధీ భవన్ వద్ద బౌన్సర్లతో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆశావహుల నిరసనల నేపథ్యంలో బౌన్సర్లను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications