నీటి పంపులో పడేసి కుమారిడిన చంపిన తండ్రి

వారికి కుమారుడు పుట్టాడు. వారి కుమారుడు బాలమల్లేష్ (3) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూత్రపిండాలు పనిచేయకపోవడంతో రెండుసార్లు నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. మూడు సంవత్సరాలుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా బాలమల్లేష్ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో శ్రీశైలం తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో శ్రీశైలం కుమారుడ్ని తీసుకెళ్ళి ఇంటి పైన ఉన్న నీటి ట్యాంకులో పడేశాడు. అనంతరం కిందికి వచ్చి తల్లికి, భార్యకు చెప్పాడు. వారు ఇంటి పైకి వెళ్ళి నీటిట్యాంకులో నుంచి బాలుడ్ని బయటకు తీశారు. అప్పటికే నీళ్లు తాగడంతో బాలమల్లేష్ మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న వనస్థలిపురం ఏసీపీ ఆనంద్‌భాస్కర్, హయత్‌నగర్ సీఐ శ్రీనివాస్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications