ఏటీఎం సెంటర్లో మంటలు, పరుగెత్తుకు వచ్చిన జనాలు
గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఏటీఎం కేంద్రంలో సోమవారం ఉదయం మంటలు, పొగలు వచ్చాయి.
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఏటీఎం కేంద్రంలో సోమవారం ఉదయం మంటలు, పొగలు వచ్చాయి. అదే సమయంలో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన పలువురు భయంతో బయటకు పరుగెత్తుకు వచ్చారు.
వెంటనే విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను మంటలను అదుపులోకి తెచ్చారు. ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు.

మరోవైపు, తెనాలి పట్టణంలో గల ఐతా నగర్లో ఆదివారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. ఓ ఇంట్లోకి అర్ధరాత్రి దొంగలు చొరబడి 46 గ్రాముల బంగారం, 2.50 లక్షల నగదును అపహరించారు. అడ్డుకోబోయిన ఇంటి యజమానిని తోసేసి పరారయ్యారు.












Click it and Unblock the Notifications