పూర్ణ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం: లక్షల్లో ఆస్తి నష్టం
విశాఖపట్నం: నగరంలోని పూర్ణ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో హుటాహుటిన అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. మొత్తం ఆరు ఫైరింజన్లు మంటలు ఆర్పేశాయి.
దుకాణాల్లో ఉన్నవి డెకరేషన్ ఐటమ్స్ కావడంతో మంటలు తొందరగా అంటుకుని వ్యాపించినట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా పేల్చిన టపాసులు దుకాణాల్లో పడి ఈ ప్రమాదం సంభించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ప్రమాదం కారణంగా దుకాణాల్లోని సామాగ్రి మొత్తం కూలిపోయింది. సుమారు రూ. 25లక్షలకుపైగా ఆస్తి నష్టం సంభించినట్లు సమాచారం. అగ్ని ప్రమాద ఘటనతో వ్యాపారులతోపాటు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.












Click it and Unblock the Notifications