మోడీ, కేజ్రీవాల్ ఎఫెక్ట్: తొలిసారి అమేథీలో రాహుల్!
లక్నో: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవానో లేక ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్ ధీమానో లేక మరో కారణమో గానీ ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తొలిసారి ఎన్నికల రోజు అమేథీ నియోజకవర్గంలో ఉన్నారు.
నెహ్రూ కుటుంబానికి రాయబరేలీ, అమేథీలు కంచుకోటలు. ఈ కారణంగానే అక్కడ మొదటి నుండి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ ఎప్పుడు ఎన్నికల రోజు అమేథీలో ఉండలేదు. అయితే బుధవారం ఆయన ఆమెథీలో తొలిసారి ఉన్నారు. ఉదయం ఆయన పుర్బత్ గంజ్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

రాహుల్ గాంధీ పైన భారతీయ జనతా పార్టీ తరఫున నటి స్మృతి ఇరానీ, ఎఎపి తరఫున కుమార్ విశ్వాస్‌లు పోటీ చేస్తున్నారు. వీరిద్దరు గట్టి పోటీ ఇస్తుండటం వల్లనే రాహుల్ స్వయంగా పోలింగ్ రోజు నియోజకవర్గానికి వచ్చారని అంటున్నారు.
మరో విషయం ఏమంటే.. ఓ పోలింగ్ బూత్‌లో బ్లాక్ బోర్డు పైన కమలం గుర్తు ఉందంటూ రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఎపి అభ్యర్థి కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ... మహమద్‌పూర్ పోలింగ్ బూత్‌ను కాంగ్రెసు ఆక్రమించుకుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications