కార్తీక దీపాలు: విశాఖ కొండలపై కార్చిచ్చు(పిక్చర్స్)
విశాఖపట్నం: విశాఖ సమీపంలోని గుడిలోవ కొండలపై గురువారం మంటలు చెలరేగాయి. వీటిని ఆర్పేందుకు నేవీ సహా, 17 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. ఇటీవల సంభవించిన తుపానుకు కొండలపై చెట్లన్నీ విరిగి అక్కడే పడి ఉన్నాయి.
నాలుగు రోజుల కిందట కప్పరాడ కొండపై అగ్ని ప్రమాదం సంభవించి చెట్లు తగలబడ్డాయి. తాజాగా గుడిలోవ కొండపై భారీగా మంటలు చెలరేగాయి. కొండపై ఉన్న శివాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నూనె దీపాలను పెద్దఎత్తున వెలిగించారు. పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం ఒంటి గంటతో ముగిశాయి. వెలుగుతున్న దీపాలు పక్కనే ఉన్న ఎండిన చెట్లను అంటుకుని మంటలు వ్యాపించాయి. గాలి తోడవడంతో కొండపై కార్చిచ్చు అంటుకుంది.

కార్చిచ్చు
విశాఖ సమీపంలోని గుడిలోవ కొండలపై గురువారం మంటలు చెలరేగాయి.

కార్చిచ్చు
వీటిని ఆర్పేందుకు నేవీ సహా, 17 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. ఇటీవల సంభవించిన తుపానుకు కొండలపై చెట్లన్నీ విరిగి అక్కడే పడి ఉన్నాయి.

కార్చిచ్చు
నాలుగు రోజుల కిందట కప్పరాడ కొండపై అగ్ని ప్రమాదం సంభవించి చెట్లు తగలబడ్డాయి.

కార్చిచ్చు
తాజాగా గుడిలోవ కొండపై భారీగా మంటలు చెలరేగాయి. కొండపై ఉన్న శివాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో పూజలు నిర్వహించారు.

కార్చిచ్చు
ఈ సందర్భంగా నూనె దీపాలను పెద్దఎత్తున వెలిగించారు. పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం ఒంటి గంటతో ముగిశాయి. వెలుగుతున్న దీపాలు పక్కనే ఉన్న ఎండిన చెట్లను అంటుకుని మంటలు వ్యాపించాయి. గాలి తోడవడంతో కొండపై కార్చిచ్చు అంటుకుంది.

కార్చిచ్చు
మంటలను అదుపు చేసేందుకు నేవీకి చెందిన ఐదు అగ్నిమాపక యంత్రాలతోపాటు, అగ్నిమాపకశాఖకు చెందిన 12 యంత్రాలను రంగంలోకి దించారు.

కార్చిచ్చు
నేవీ హెలికాప్టర్లద్వారా మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా, చీకటి పడడంతో సాధ్యం కాలేదు. ఈ కొండ 17 వేల ఎకరాల్లో విస్తరించి ఉందని డిఎఫ్‌ఓ రామ్మోహనరావు తెలిపారు.
మంటలను అదుపు చేసేందుకు నేవీకి చెందిన ఐదు అగ్నిమాపక యంత్రాలతోపాటు, అగ్నిమాపకశాఖకు చెందిన 12 యంత్రాలను రంగంలోకి దించారు. అగ్నిమాపక శకటాలు కొండలపైకి చేరే పరిస్థితి లేదు. నేవీ హెలికాప్టర్లద్వారా మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా, చీకటి పడడంతో సాధ్యం కాలేదు. ఈ కొండ 17 వేల ఎకరాల్లో విస్తరించి ఉందని డిఎఫ్‌ఓ రామ్మోహనరావు తెలిపారు.
అటవీ శాఖకు చెందిన ఈ రిజర్వ్‌ఫారెస్ట్‌లో అనేక రకాల ఫల వృక్షాలు ఉన్నాయని చెప్పారు. ఇది పూర్తిగా తగులబడితే, చాలా నష్టం వాటిల్లుతుందని చెపుతున్నారు. ఈ మంటలు కొండ దిగువకు వ్యాపిస్తే గ్రామాలు బూడిదయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొండ చుట్టూ ఉన్న మిందివానిపాలెం, దిబ్బనీడపాలెం, మామిడిలోవ, దబ్బండ, కొమ్మాది, బక్కన్నపాలెం, పైనాపిల్ కాలనీ గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు.












Click it and Unblock the Notifications