మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య
అమరావతి: మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్‌గా పనిచేస్తున్న చెన్నకేశవులు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరులోని బ్రాడీపేట 4వ లైనులో ఉన్న తన గదిలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్పీ అరీఫ్ హఫీజ్.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
చెన్నకేశవులు ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చెన్నకేశవులు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కడప జిల్లాలోని యర్రగుంట్ల వినాయకనగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. సీనియర్ ఇంటర్ చదువు తున్న నిట్టూరు సిద్దేశ్వరి (17) సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ పరీక్షలు సమీపిస్తుండటంతో ఫెయిల్ అవుతానేమో అనే భయంతో తన కుమార్తె సిద్దేశ్వరి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డినట్లు ఆమె తండ్రి సోమవారం ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశా రు.
ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, సిద్దేశ్వరి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. సిద్దేశ్వరికి తండ్రి నిట్టూ రు బాబు, తల్లి ఫాతిమా, ఇద్దరు సోదరులు ఉన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications