తెరాసలో చేరడం లేదు: కేసీఆర్‌ను కలిశాక మాజీ ఎంపీ వివేక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు జీ వివేక్ బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారు. వివేక్ కాంగ్రెస్ పార్టీ నుండి 2009లో ఎంపీగా గెలిచారు.
అనంతరం తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన అనంతరం... తిరిగి ఆయన సొంత గూటికి చేరుకున్నారు. 2014లోను పెద్దపల్లి నుండి ఎంపీగా పోటీ చేసి విద్యార్థి నేత, తెరాస ఎంపీ బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు.
కేసీఆర్‌ను కలిసిన అనంతరం వివేక్ విలేకరులతో మాట్లాడారు. తాను తెరాసలో చేరుతానన్నది ఊహాజనితమే అన్నారు. తన తండ్రి మెమోరియల్ ఏర్పాటు కోసం స్థలం ఇవ్వాలని కేసీఆర్‌ను కలిశానని చెప్పారు.
తిరుపతి ఉపఎన్నికల నుంచి తప్పుకుంటాం!

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అములు చేస్తే తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటామని పీసీసీ చీఫ్ రఘువీరా స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సంప్రదాయాన్ని గౌరవిస్తూ పోటీ చేయకపోయినా, కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధమైన విషయం తెలిసిందే.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా పోటీ నుంచి తప్పుకుంటుందని, అందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని టీడీపీ తమకు హామీ ఇవ్వాలని రఘువీరా డిమాండ్ చేశారు. తిరుపతిలో ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన ఈ రోజు కాంగ్రెస్ ఈ విధంగా ప్రకటించడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.
జల వివాదంపై చేతులెత్తేసిన కృష్ణా రివర్ బోర్డు
కృష్ణా నది జలాల గురించి తెలుగు రాష్ర్టాల మధ్య చెలరేగిన వివాదం పరిష్కారంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చేతులెత్తేసింది. ఇక నుంచి రెండు రాష్ర్టాల పరస్పర ఫిర్యాదులపై తటస్థంగా ఉంటామని తేల్చి చెప్పింది. జల వివాదాలను ఇరు రాష్ర్టాలు పరిష్కరించుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications