వైసీపీ ఆఫర్ ఉంది కానీ.. సీటు దక్కని టీడీపీ మాజీ మంత్రి కామెంట్స్..!

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఎన్డీయే కూటమి సీట్ల పంపకాలు ఇందులోని మూడు పార్టీల్లోనూ చిచ్చు రేపాయి. పలు నియోజకవర్గాల్లో సీట్లు దక్కని నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇదే క్రమంలో వారు పార్టీలు మారేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. అయితే వీరికి కనిపిస్తున్న ఏకైక ప్రత్యామ్నాయం అధికార వైసీపీ. అయితే ఇన్నాళ్లూ వైసీపీకి వ్యతిరేకంగా క్షేత్రస్దాయిలో పోరాటాలు చేసిన వీరు ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్ళేందుకు తిరిగి ఆలోచిస్తున్నారు.

ఇలాంటిదే విశాఖ జిల్లా పెందుర్తిలో ఈసారి సీటు దక్కని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి స్టోరీ. తాజాగా ఈ సీటును టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చేయడంతో బండారు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పార్టీ అధినేత చంద్రబాబు పిలిచి మాట్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బండారు తాజా పరిణామాలపై స్పందించారు. తనకు వైసీపీ ఆఫర్ ఉందన్నారు.

former tdp minister bandaru satyanarayana murthy interesting comments on ysrcp offer

తనకు వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించానని.. టీడీపీలోనే కొనసాగుతానని బండారు సత్యనారాయణ మూర్తి తేల్చిచెప్పేశారు. ఇవాళ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నా కట్టే కాలేంతవరకు నేను పసుపు జెండా మోస్తూనే ఉంటా.. నా చితి మీద పసుపు జెండా వేసి కాల్చాలి' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

పెందుర్తి ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆయన. . ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నేటి వరకు పార్టీ కోసం చాలా ఉద్యమాలు చేశానన్నారు. తెలుగుదేశం పార్టీకి తాను ఏ పాపం చేశానని సీటు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. 45 ఏళ్లు సుదీర్ఘంగా పార్టీ కోసం కష్టపడిన తాను ఏ రోజు పార్టీకి అన్యాయం చేయలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+