అగ్నిప్రమాదంలో నలుగురు మృతి, దొంగల బీభత్సం
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాలోని పాలిగ్రామపురంలో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ నగరంలోని బొల్లారంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గత రాత్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో దొంగలు దోపిడీకి యత్నించారు. దుండగులను పట్టుకోడానికి యత్నించిన పోలీసులపై దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో మాంటిస్సోరి స్కూల్ బస్సు మంగళవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. బస్సులో క్లీనర్ లేకపోవడంతో విద్యార్థులు బస్సు ఎక్కారా లేదా తెలుసుకునే ప్రయత్నంలో డ్రైవర్ పక్కకు చూడటంతో బస్సు అదుపుతప్పి గుంటలో పడింది.
విద్యార్థులు ఒకరిపై ఒకరు పడటంతో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సులో క్లీనర్ లేకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications