మేం చెప్పేది ప్రివిలేజ్ కమిటీ వినట్లేదు: వైసిపి ఎమ్మెల్యే, హాజరైన 4గురు
అమరావతి: సభా హక్కుల సంఘం తాము చెప్పేది వినడం లేదని, ఏం చేయాలో కమిటీ ముందే నిర్ణయించుకుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంగళవారం నాడు అన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఈ రోజు వైసిపి సభ్యులు నలుగురు హాజరయ్యారు.
హాజరైన అనంతరం వైసిపి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విలేకరులతో మాట్లాడారు. తాము ఏం చెప్పినా వినడం లేదని, వారు ముందే అన్నీ నిర్ణయించుకున్నారని చెప్పారు. తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే తమ పైన చర్యలు తీసుకోవాలనుకోవడం విడ్డూరమన్నారు.

ప్రివిలేజ్ కమిటీలో తమకు ఒకే సభ్యుడు ఉన్నాడని చెప్పారు. మరొకరికి అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఉదయం ఏపీ శాసనసభలో సభా హక్కుల సంఘం సమావేశమైంది. హక్కుల సంఘం ఎదుట నలుగురు వైసిపి ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొందరు వైసిపి సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. సభా హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించిన 12 మంది వైసిపి ఎమ్మెల్యేలకు సభా హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. దీంతో ఇవాళ విచారణకు నలుగురు ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, దాడిశెట్టి రాజా, జగ్గిరెడ్డి, శివప్రసాద్ రెడ్డి హాజరయ్యారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications