'జగన్ ఇంట్లో శిలువ.. పెళ్లి చర్చిలో, జయసుధ మాటేంటి'

హైదరాబాద్: తిరుమల కొండపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా టిటిడి ఈవో గోపాల్ ఆయనను వెనుకేసుకు వస్తూ అపరిచితుడిలా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు శనివారం అన్నారు. జగన్ ఇంట్లో శిలువ, ఆయన పెళ్లి చర్చిలో, ఆయన తల్లి చేతిలో ఎప్పుడు బైబిల్ ఉండే విషయం టిటిడి అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు.

తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా జగన్ ఆలయం దాకా చెప్పులతో వచ్చారని, జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ డిక్లరేషన్ తీసుకోలేదన్నారు. జగన్ తన నివాసం అయిన లోటస్ పాండులో శిలువ పెట్టుకున్నారని, జగన్ తల్లి విజయమ్మ చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుందని, ఇంతకంటే రుజువు ఇంకేం కావాలాని ప్రశ్నించారు.

Gali Muddu Krishnama Naidu

టిటిడి అధికారులకు ఇవన్నీ తెలిసనా కొండ పైన ఏమీ జరగలేదని గవర్నర్‌కు నివేదిక ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. జగన్ పేరులో క్రిస్టియానిటీ లేదని టిటిడి అధికారులు చెబుతున్నారని, మరి జయసుధ పేరులో ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఆమె చేత డిక్లరేషన్ పైన సంతకం చేయించిన టిటిడి అధికారులు జగన్ పైన మాత్రం అంత ప్రేమ ఎందుకు చూపారన్నారు.

టిటిడి అధఇకారుల వ్యవహార శైలిపై సిబిఐ దర్యాఫ్తు చేయాలన్నారు. ఒక సాధారణ ఎంపికి ఇవ్వాల్సిన మర్యాదకు మించి చేశారన్నారు. జగన్ బస, తిండి ఏర్పాట్లన్నింటినీ టిటిడిలో మూడు ముఖ్య శాఖలకు అధికారిగా పని చేస్తున్న అధికారి దగ్గరుండి పర్యవేక్షించారన్నారు. జగన్‌ను ఆలయంలోకి తీసుకెళ్లేప్పుడు కూడా రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి స్థాయిలో రాచమర్యాదలు స్వాగతం పలకడం నిబంధనలకు విరుద్దమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+