త్వరలో తెర దించుతా, 23తర్వాత కఠిన నిర్ణయం: గంటా

Ganta Srinvias Rao
హైదరాబాద్: పార్టీ మార్పు ఊహాగానాలకు తాను త్వరలో తెర దించుతానని, 23వ తేదీ తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాస రావు మంగళవారం అన్నారు. అసెంబ్లీ వాయదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీలో కొనసాగాలో లేదో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.

23 తర్వాత చాలామంది కఠిన నిర్ణయాలు తీసుకుంటారన్నారు. తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాననే ఊహాగానాలకు త్వరలో తెర దించుతానన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరగాలన్నారు. బిల్లు పైన చర్చను అడ్డుకుంటున్న సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఓ బలమైన సామాజిక వర్గం కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. 2014లో కూడా సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని గంటా ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి షోకాజ్ నోటీసు అందలేదని, కిరణ్‌తో సహా అందరు మాట్లాడిందే తాను మాట్లాడనన్నారు. బిల్లుపై చర్చ జరగాలని, లేదంటే రాష్ట్రపతి గడువు పెంచేందుకు అంగీకరించరన్నారు. 23 తర్వాత ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.

డిప్యూటీ సిఎంతో భేటీ

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు హరీష్ రావులు భేటీ అయ్యారు.

అభ్యంతరాలు చెప్పుకోవాలి: ఎర్రబెల్లి

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరగాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ర్రబెల్లి దయాకర రావు అన్నారు. సీమాంధ్ర నేతలు తమ అభ్యంతరాలను సభలో చెప్పాలన్నారు. తమకు కూడా కొన్ని అభ్యంతారాలు ఉన్నాయని, వాటిని సభలో చెబుతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+