చంద్రబాబు హ్యాట్రిక్, 16తర్వాత పవన్ కనిపించరు: గట్టు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఇక సింగపూరే గతి అని, ఆయన హ్యాట్రిక్ కొట్టబోతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్ర రావు గురువారం ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు బిచాణా ఎత్తేసి సింగపూర్‌కు వెళ్లిపోవడం ఖాయమని, తిరిగి ఎప్పటికో కోలుకోలేని రీతిలో ఫలితాలు రాబోతున్నాయన్నారు.
ఆంధ్రాలో తమ పార్టీకి భారీ మెజార్టీ, తెలంగాణలో కింగ్ మేకర్‌గా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భవిస్తుందన్నారు. సీమాంధ్రలో టిడిపి-బిజెపి మాయాకూటమి కుతంత్రాలు ఎన్నికల్లో పని చేయలేదన్నారు. సీమాంధ్రలో తమ పార్టీకి 135 అసెంబ్లీ సీట్లు, 25 లోక్‌సభ స్ధానాలు వస్తాయన్నారు.

ప్రజలు చంద్రబాబు, వెంకయ్య నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రసంగాలను పట్టించుకోలేదని, నమ్మలేదన్నారు. బాబుకు ఇవి చివరి ఎన్నికలన్నారు. మూడు వరుస ఓటమిలతో హ్యాట్రిక్ సాధించబోతున్నారన్నారు. బెట్టింగ్ బిజినెస్ కోసమే లగడపాటి రాజగోపాల్ సర్వేలు చేస్తున్నారన్నారు. మే 16వ తేదీ తర్వాత పవన్‌కళ్యాణ్ కనిపించరన్నారు.
చంద్రబాబు, వెంకయ్య, పవన్, ఎల్లో మీడియా కలిసి దుష్టచతుష్టయంగా ఏర్పడి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పని చేయేలేదన్నారు. మోడీ, పవన్‌లను మెచ్చుకుంటున్న చంద్రబాబు.. ఎన్నికల ఫలితాల తర్వాత వారిని కచ్చితంగా విమర్శిస్తారన్నారు. తాను చేసే తప్పులను ఇతరులపై నెట్టడం బాబుకు అలవాటన్నారు.












Click it and Unblock the Notifications