ప్రియుడి కోసం యువతి క్షుద్రపూజలు: బంగారంతో చెక్కేశాడు
కడప: తన ప్రియుడిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఓ యువతి క్షుద్రపూజలకు పూనుకుంది. అయితే, పూజలు చేస్తానని చెప్పిన వ్యక్తి దొంగతనం చేసి పరారయ్యాడు. కడప జిల్లా రాజంపేటలో ఈ సంఘటన జరిగింది. తాను ప్రేమించిన వ్యక్తి ఎలాగైనా తనకు దక్కాలన్న స్వార్థంతో ఓ మహిళ ఒక కోయదొరను ఆశ్రయించింది.
చివరకు అతని చేతిలో మోసపోయింది. దోషం ఉందని, దోష నివారణకు బంగారంతో పూజ చేయాలని కోయదొర ఆమెకు సూచించాడు. పూజకోసమని యువతి తెచ్చిన 25తులాల బంగారాన్ని తీసుకొని కోయదొర చెక్కేశాడు. దీంతో చేసేదేమీ లేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

నిందితుడి గాలింపు మొదలుపెట్టిన పోలీసులకు, దొంగిలించిన బంగారం విక్రయిస్త దొరికిపోయాడు. దొంగ బాబాల బాగోతులు ఎన్నో బయటపడుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. సమాజం ముందుకు సాగుతోందని భావిస్తున్న సమయంలో కూడా మూఢనమ్మకాలతో కొంత మంది మోసపోతున్నారు.












Click it and Unblock the Notifications