రేప్‌తో గర్భం దాల్చిన బాలిక: నిందితుడికి రూ.60 వేల జరిమానాతో సరి
కడప: కడప జిల్లా దువ్వూరులో ఓ కుటుంబంలో జరిగిన సంఘటన అత్యంత అమానుషంగా ఉంది. గ్రామంలో ఓ కుటుంబంలోని 16 ఏళ్ళ బాలికను 8వ తరగతి వరకు చదివించిన తండ్రి స్థోమత లేక పాఠశాల మాన్పించాడు. అదే వీధికి చెందిన మహా నంది అనే యువకుడు బాలికతో మాయ మాటలు చెప్పి కామవాంఛ తీర్చుకున్నాడు.
బాలికకు గర్భం రావడంతో విషయం తల్లి దండ్రులకు తెలిసింది. వారు నిందితుడు మహానంది తండ్రి బాలయ్యతో వాగ్వాదం దిగారు. చేసేదీ ఏమీ లేక బంధువులు, పెద్ద మనుషుల జోక్యంతో రూ. 60 వేలకు పంచా యితీ చేశారు. ఈ విషయమై స్థానికులు కొందరు అధికారులకు సమాచారం ఇవ్వ డంతో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
మానవహక్కుల వేదిక కన్వీనరు జయశ్రీ, ఐసీడీయస్ అధికారిణి ఆదిలక్షుమ్మ, బాలికల సంరక్షణాధి జిల్లా అధికారి శివప్రసాద్‌లు బాలికతోపాటు నిందితుడు మహానంది కుటుంబ సభ్యులను విచారించారు. పంచా యితీ చేసిన పత్రాలను వారు తీసుకున్నారు. పోలీసు కేసు పెట్టాలంటూ బాలిక తల్లి దండ్రులకు వివరించారు. కేసు పెడితే కష్ట మవుతుందని, పెట్టమని వారు తేల్చి చెప్పా రు.

కాగా జరిగిన విషయాలను స్థానిక అధికారులు జిల్లా అధికారులకు చెప్పడంతో వారి ఆదేశాల మేరకు మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణం, దువ్వూరు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డిలు జోక్యం చేసుకొని పాప తండ్రితో కేసు నమోదు చేయించారు.
ఈ కేసులో నిందితుడు మహానంది, పంచాయితీ చేసిన బాలిక మామ రంగనాధ్, గురువు షాప్‌జి, తిరుపాలు, న్యాయవాది ఇమామ్ బాషా, మీడియా విలేకరులు రియాజ్, మాచయ్యలతో పాటు నిందితుడి తండ్రి బాలయ్య, దూదేకుల చెన్నమ్మ అనే మహిళపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications