'కేంద్రంతో విడాకులు ఐదు నిమిషాల పని.. దూరడానికి వైసీపీ రెడీ!'
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై స్పందించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్యాకేజీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. సీఎం చంద్రబాబు కూడా ప్యాకేజీ పట్ల సంతృప్తిగా లేరని స్పష్టం చేశారు.
కేంద్రంతో పేచీకి దిగితే విడాకులు తీసుకోవడం ఐదు నిమిషాల్లో అయిపోయే పని అన్నారు బుచ్చయ్య చౌదరి. అయితే విడాకుల తర్వాత భార్య భర్తలు బాగానే ఉన్నా.. పిల్లల భవిష్యత్తు ఏంటనేది కూడా ఆలోచించాల్సిన విషయమన్నారు.

ఇక ఇదే విషయంపై వైసీపీ మీద విమర్శలు చేసిన బుచ్చయ్య చౌదరి.. కేంద్రం నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోతే వైసీపీ అందులోకి దూరాలని ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా చంద్రబాబు ఏపీని 12శాతం వృద్ధిరేటులోకి తీసుకొచ్చారన్న విషయాన్ని మరిచిపోవద్దని బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications