నవ నిర్మాణ దీక్షపై చంద్రబాబు: అచ్చం కేసీఆర్ లాగే ఏపీలో సమగ్ర సర్వే
అమరావతి: జూన్ 2న ఉదయం 11 గంటలకు నవ నిర్మాణ దీక్ష ఉంటుందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నవ నిర్మాణ దీక్ష చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జూన్ 2న చేపట్టే నవ నిర్మాణ దీక్ష, జూన్ 8న చేపట్టే మహా సంకల్ప దీక్షపై అందుబాటులో ఉన్న మంత్రులు, జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. జూన్ 3వ తేదీన రాష్ట్ర విభజనపై చర్చలు, దాని ప్రభావం, విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులను చర్చించాలని సూచించారు. జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కుటుంబ సమగ్ర సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సర్వే తరహాలో ఏపీలో కూడా జూన్ 15 నుంచి రాష్ట్రంలో పల్స్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కులాల వారీగా ఈ సర్వే చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

ఈ సమగ్ర సర్వే ద్వారా రాష్ట్ర ప్రజల పూర్తి వివరాలు ప్రభుత్వానికి తెలుస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. సమగ్ర సర్వేపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆయన ప్రజలకు సూచించారు. ఈ సర్వే ద్వారా సంక్షేమ పథకాల్లో కోత ఉండదని ఆయన చెప్పారు. రిజర్వేషన్లు ఇచ్చేందుకు సమగ్ర సర్వే నివేదిక ఉపయోగపడుతుందని అన్నారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ముద్రగడ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం ఈ నివేదికను ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలోని వివిధ కులాల ఆర్థిక స్తోమతను తెలుసుకోవడానికే సర్వే చేస్తున్నామని సోమవారం చంద్రబాబు మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications