చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల పేరుతో పార్క్: అడ్డుకొన్న మరో వర్గం, దాడులు
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్ళ పాలెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది..
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్ళ పాలెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. ప్రభుత్వ స్థలం విషయంలో ఏర్పడిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారి పరస్పర దాడుల వరకు వచ్చింది.
ఓ వర్గానికి చెందిన వారికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఆ గ్రామంలో భారీగా మోహరించారు. పవన్ కల్యాణ్, చిరంజీవి పేరుతో పార్కు ఏర్పాటుచేయాలని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్ ను మరో వర్గం అడ్డుకుంది. ఇక్కడ మొదలైన వివాదం దాడుల వరకూ వెళ్లింది.

దాడుల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.
విషయం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.ఇరువర్గాలను సముదాయించారు. అయితే ముందు జాగ్రత్తగా గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.












Click it and Unblock the Notifications