వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రక్రియ వేగమైంది, తీర్మానంపై కాంగ్ డైలమా: విశ్వరూప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishwaroop
న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన ప్రక్రియ వేగవంతమవుతోందని మాజీ మంత్రి విశ్వరూప్ శుక్రవారం అన్నారు. రాష్ట్ర విభజన ఇష్టం లేకనే తాను కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చినట్లు చెప్పారు. తెలంగాణపై తీర్మానమా? లేక అభిప్రాయమా? అనే విషయమై అధిష్టానం డైలమాలో ఉందని చెప్పారు.

జివోఎం భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం శుక్రవారం ఢిల్లీలోని హోంమంత్రి కార్యాలయంలో భేటీ అయింది. ఈ భేటీ షిండే అధ్యక్షతన సాగింది. భేటీలో గులాం నబీ ఆజాద్, జైరామ్ రమేష్, వీరప్ప మొయిలీ, నారాయణ స్వామిలు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి చిదంబరం అమెరికా పర్యటనలో ఉన్నందున, ఎకె ఆంటోనీ ఆసుపత్రిలో ఉన్నందున సమావేశానికి హాజరు కాలేదు. విభజనపై మంత్రుల బృందం ఏర్పాటు అయినన తర్వాత మొదటిసారి సమావేశం అవుతుండటంతో అందరిలోను ఉత్కంఠ నెలకొంది.

క్షీణించిన బాబు ఆరోగ్యం

తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఎపి భవన్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఆయనను వైద్యులు శుక్రవారం ఉదయం పరీక్షించారు. ఆరోగ్యం మరింత క్షీణించిందని, వెంటనే దీక్ష విరమించాలని సూచించారు.

English summary
Group of Minister met on Firday morning at Home Minister Sushil Kumar Shinde's office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X